ఇక ఎందుకూ పనికిరావేమో..
రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు
దెబ్బతింటున్న వాహనాలు
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల సంరక్షణలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల వ్యయంతో కొన్న
వాహనాలు, యంత్రాలు, ఇతర వస్తువులు ప్రస్తుతం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల కోసం తెచ్చిన ఈ వాహనాలు నిర్వహణ లేకపోవడంతో తుప్పుపట్టి దెబ్బతింటున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. నిరుపయోగంగా ఉన్న వాహనాలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


