నా కుమార్తె 11 నెలల క్రితం పెద్దాస్పత్రిలో పురుడు పోసుకుంది. మగబిడ్డ పుట్టాడు. బర్త్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే రెండుసార్లు తిరిగా. సమాధానం లేదు. త్వరగా సర్టిఫికెట్ ఇప్పించాలి.
– మొద్దు శోభ, యామాలపాడు, కావలి మండలం
అవకాశం కోల్పోతాం
నా తండ్రి మహబూబ్‌జాన్ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెంది నెలరోజులు కావొస్తోంది. డెత్ సర్టిఫికెట్ కోసం మూడు దఫాలుగా తిరుగుతున్నా. మళ్లీ రా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఈనెల 12వ తేదీలోపు మా అమ్మ విడో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇస్తే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతాం. కలెక్టర్ స్పందించి వెంటనే సర్టిఫికెట్ ఇప్పించాలి.
– మక్సూద్, గాంధీ నగర్, నెల్లూరు


