హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలను అమలు చేయాలి

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

మోసపోయాం

నిరుద్యోగ భృతిపై ఆశలు పెట్టుకు న్న యువకులు మోసపోయారు. నెలకు రూ.మూడు వేల చొప్పున ఈ రెండేళ్లలో రూ.72 వేలను ఇవ్వాల్సి ఉంది. అయితే నేటికీ పైసాను సైతం విదిల్చలేదు. హామీలను అమలు చేసి అండగా నిలవాలి.

– దేవకుమార్‌, నిరుద్యోగి, కృష్ణపట్నం

ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. సర్కార్‌ కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్నా, భృతిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లభించక యువత నిరాశతో ఉన్నారు. చాలా మంది పక్క రాష్ట్రాలకు వలసెళ్లి జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. నెలకు రూ.మూడు వేలను అందజేస్తే కొంతమేరైనా ఆసరాగా ఉంటుంది.

– షంషుద్దీన్‌, నిరుద్యోగి, ముత్తుకూరు

Advertisement
 
Advertisement
Advertisement