● 17 మందికి అందని పింఛన్ నగదు
వరికుంటపాడు: మండలంలోని యర్రంరెడ్డిపల్లి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పీడీఏ నిర్లక్ష్యం.. పింఛన్‌దారులకు అగచాట్లు మిగిల్చింది. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన అందించే పింఛన్లను పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) తిరుమల నారాయణ గ్రామంలో కొంతమందికి అందించగా, 17 మందికి అందజేయకుండా వెళ్లిపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిని పలువురు మీడియా దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఎంపీడీఓ రమణారెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారికి నోటీసులు జారీ చేసి, నగదును రికవరీ చేసి, వచ్చే నెల పింఛన్‌తో కలిపి అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈనెల పింఛన్ నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే ఎదురైంది.


