సంగీతాన్ని ఆస్వాదించాలి | - | Sakshi
Sakshi News home page

సంగీతాన్ని ఆస్వాదించాలి

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

వెంకటాచలం: సంగీతాన్ని వినడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. సంకీర్తన సుధాకర గరిమెళ్ల అనిలకుమార్‌ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరిని వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో గురువారం నిర్వహించారు. పలు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. సంగీతం అంటే కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదని, శాసీ్త్రయ సంగీత లోతును తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను అందజేశారు. స్వర్ణభారత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపావెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement