గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

నిందితుల్లో రౌడీషీటర్లు

పట్టపగలు నడిరోడ్డుపై దారుణం

ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు

గూడూరు: కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి మత్తులో యువత అరచాకాలు పేట్రేగిపోతున్నాయి. సామాన్యుల నుంచి చివరకు పోలీసులు సైతం ఈ అరాచక శక్తుల చేతుల్లో బాధితులవుతున్నారు. తాజాగా శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఓ కానిస్టేబుల్‌పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన శుక్రవారం గుడూరు పట్టణంలోని సంగం సినిమా థియేటర్‌ సమీపంలో నడిరోడ్డుపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణానికి చెందిన ముగ్గురు రౌడీషీటర్లు గంజాయి మత్తులో బైక్‌పై అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు. అటు వైపుగా వెళ్తూ గమనించిన గూడూరు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ గోపీ వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. యువకులు ‘నీకు ఎందుకురా.. మాఇష్టం వచ్చినట్లు వెళ్తాం’ అంటూ కానిస్టేబుల్‌ను చితకబాదారు. స్థానికులు యువకులను యువకుల్ని అడ్డుకుని పంపించి వేశారు. కానిస్టేబుల్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని యువకులపై ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టారు. గతంలో గూడూరు రూరల్‌ కానిస్టేబుల్‌ను బనిగేసాహెబ్‌పేట ప్రాంతంలో ఓ యువకుడు కర్రతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరొకటి జరగడంతో కూటమి ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నిందితులను వదిలేయాలని అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారిని స్టేషన్‌ బెయిల్‌పై పంపేశారు. ఈ ఘటనతో గూడూరులో కలకలం రేగింది.

Advertisement
 
Advertisement
Advertisement