గూడూరు ఆర్డీఓగా అరుణకుమారి | - | Sakshi
Sakshi News home page

గూడూరు ఆర్డీఓగా అరుణకుమారి

Jun 6 2026 12:35 AM | Updated on Jun 6 2026 12:35 AM

గూడూరురూరల్‌: గూడూరు నూతన ఆర్డీఓగా ఎం.అరుణకుమారి శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ గతంలో ప్రొ హిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖలో 18 ఏళ్లపాటు సీఐ కేడర్‌లో పనిచేశారు. అనంతరం రెవెన్యూ విభాగంలో చేరి డీటీ, తహసీల్దార్‌ బాధ్యతలను చిత్తూరు జిల్లాలో నిర్వర్తించారు. చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేస్తుండగా పదోన్నతిపై గూడూరు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. చిల్లకూరు మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, క్రిస్‌సిటీ భూ పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి పలు సమస్యలు ఉన్నాయని పలువురు విలేకరులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓను మర్యాదపూర్వకంగా కలిశారు.

కమిషనర్‌గా మల్లికార్జునరావు

చిల్లకూరు: గూడూరు మున్సిపల్‌ కమిషనర్‌గా విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్న మల్లికార్జునరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు శుక్రవారం మున్సిపల్‌ అధికారులు తెలిపారు. కమిషనర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత నెలాఖరులో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కార్యాలయంలో పనిచేస్తున్న సోమశేఖర్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం నూతన కమిషనర్‌గా మల్లికార్జునరావును నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement