రామిరెడ్డికి ఆత్మీయ సన్మానం | - | Sakshi
Sakshi News home page

రామిరెడ్డికి ఆత్మీయ సన్మానం

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

కావలి: రెండు దశాబ్దాలకుపైగా టీడీపీలో కీలక నేతగా ఉండడమే కాకుండా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. బీద సోదరులకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ సోదరుడు గుండ్లపల్లి మురళి గురువారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కావలి ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని సత్కరించి కార్యకర్తలకు గౌరవం, ప్రేమాభిమానం వైఎస్సార్‌సీపీలో దక్కుతుందన్నారు. కాగా ఏడాదిన్నరగా టీడీపీలో తగిన గౌరవం లేకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement