సోమశిల: కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన శంకర్ నగరం కాలు వ కట్ట మార్గాన గురువారం వెలుగుచూసింది. ఎస్సై రాజేష్ కథనం మేరకు.. అనంతసాగరం మండల పరిధిలోని లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన దివానపు రవి(51) నాలుగు రోజుల క్రితం ఆత్మకూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి నుంచి లక్కరాజుపల్లికి వెళ్లేందుకు దగ్గరగా ఉండే శంకర్ నగరం కాలువ కట్ట మార్గాన ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి జారి కాలువలో పడ్డారు. నాలుగు రోజుల నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలిస్తుండగా గురువారం కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


