డీఎస్సీ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యుడిగా పర్వతరెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యుడిగా పర్వతరెడ్డి

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

నెల్లూరు రూరల్‌: డీఎస్సీ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యుడిగా ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది.

16 మంది డీటీలకు

తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో 16 మంది డీటీలకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులను కల్పిస్తూ ఉత్తర్వులను సీసీఎల్‌ఏ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయలక్ష్మి గురువారం జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 49 మందికి ఉద్యోగోన్నతలు కల్పించగా, ఇందులో జిల్లాలో 16 మందికి లభించాయి. పోతల పద్మజాకుమారి, గుడుగుంట స్వర్ణ, స్వప్న, లక్ష్మీప్రసన్న, ఫజియా, నాగచంద్రకళ, సారంగపాణి, గయాజ్‌ అహ్మద్‌, రమేష్‌కుమార్‌, మునెమ్మను జిల్లాకే కేటాయించారు. సురేష్‌బాబు, రామమోహన్‌, మారుతికృష్ణప్రసాద్‌, లక్ష్మీనారాయణ, శ్రావణ్‌కుమార్‌, కొండా శిరీషను మార్కాపురం జిల్లాకు బదిలీ చేశారు.

రోగ నిర్ధారణలో

ఎల్టీల పాత్ర కీలకం

నెల్లూరు(అర్బన్‌): రోగ నిర్ధారణలో ల్యాబ్‌ టెక్నీషియన్ల పాత్ర కీలకమని డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లతో సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు, ఫలితాలు, రికార్డులపై క్షుణ్ణంగా వివరించారు. ప్రతి పరీక్షను జాగ్రత్తగా చేయాలని కోరారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం, డాక్టర్‌ సునీల్‌, అసిస్టెంట్‌ మలేరియాధికారి జయరామ్‌, గణాంకాధికారి సహన తదితరులు పాల్గొన్నారు.

రైతులకు విరివిగా రుణాలివ్వాలి

ఉదయగిరి: బ్యాంకర్లు తమ పరిధిలోని రైతులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మణిశేఖర్‌ పేర్కొన్నారు. ఉదయగిరి బ్లాక్‌ పరిధిలోని వివిధ బ్యాంకర్లతో స్థానిక సీ్త్ర శక్తి భవనంలో గురువారం నిర్వహించిన జేఎమ్మెల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు రూ.6500 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల రుణాల లక్ష్యం రూ.32,445 వేల కోట్లు కాగా, రూ. 41 వేల కోట్లను పంపిణీ చేసి 128 శాతం వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా మంజూరు చేసి 110 శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. బీమా పథకాలకు సంబంధించి ఖాతాదారులు రెన్యువల్‌ చేయించుకునేలా బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బ్యాంక్‌ ఖాతాలో జమ కావాలంటే ఖాతాదారులు ఈ – కేవైసీని విధిగా చేయించుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కెనరా బ్యాంక్‌ అందించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్‌ ఖాతా కలిగి ఉండేలా చూడాలని చెప్పారు. బ్యాంక్‌ అధికారులు డాక్టర్‌ బాబు, రవిశంకర్‌, కోటేశ్వరరావు, గురుస్వామి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ బాలుకు ఘన నివాళి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఆదిత్యనగర్‌లో గల పార్కులో ఆయన విగ్రహానికి పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు రాజేశ్వరరావు, లక్ష్మీలీల, కార్యదర్శులు లలితారెడ్డి, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, సుజాత, జ్యోతిర్మయి, శ్రీనివాసరావు, లక్ష్మి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement