మార్కెట్లోకి యమహా కొత్త బైక్‌లు
నెల్లూరు (టౌన్): దర్గామిట్టలోని గోల్డ్ ఫీల్డ్స్ యమహా షోరూంలో శనివారం ఎక్స్‌ఎస్సార్ 155, ఎఫ్‌జెడ్ రేవ్ నూతన బైకులను కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె.మధు మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోల్డ్‌ఫీల్డ్స్ ఎండీ హరీష్ మాట్లాడుతూ యమహా ఆర్‌ఎక్స్ 100 లెగసీని ఈ తరానికి అందించాలన్న ఉద్దేశంతో యమహా న్యూ రెట్రో, మోడల్ యమహా ఎక్స్‌ఎస్సార్ 155ను నాలుగు రంగుల్లో కొత్త ఫ్యూచర్స్‌తో తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు మరో మోడల్ ఎఫ్‌జెడ్ రేవ్ న్యూ ఫ్యూచర్స్‌తో తీసుకొచ్చారన్నారు. ఎక్స్‌ఎస్‌ఆర్ 155 లిక్విడ్ కూల్ ఇంజిన్‌తో పాటు అప్ అండ్ డౌన్ సస్పెన్షన్ కలిగి డ్యూయల్ చానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంతో వచ్చిందన్నారు. ఈ బైక్ షోరం రూ.1,50,724లుగా ధర కాగా, ఎఫ్‌జెడ్ రేవ్ షోరూం ధర రూ.1,17,218లుగా నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామకృష్ణ, మేనేజర్ సారథి, అడ్మిన్ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.


