ముందస్తు చర్యలెక్కడ?
● ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో పునరుద్ధరణ చర్యలు చేస్తున్నారు. కానీ అంతరాయాలు రాకుండా ముందస్తు చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు’ అని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అధికారులను ప్రశ్నించారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన కోవూరు డివిజన్ విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ప్రతి సెక్షన్ కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి సిబ్బంది రావాలని ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లను అధికారులు తనిఖీలు చేస్తుండాలన్నారు. విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. పగటి పూట వీధి దీపాలు వెలగకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బ ంది వారు విధులు నిర్వహిస్తున్న హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్ ఈ రాఘవేంద్రం, కోవూరు ఈఈ రమేష్‌చౌదరి, డీఈఈ మధుసూదనరెడ్డి, సతీష్, సురేంద్ర, వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవె న్యూ సిబ్బంది పాల్గొన్నారు.


