ఎస్‌ఈబీ అంటేనే హడల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

ఎస్‌ఈ

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌

టీడీపీ సర్కార్‌ కొలువుదీరాక జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడ చూసిన విక్రయాలు జోరుగా సాగుతూ సింహపురిలో శాంతిభద్రతలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాడవాడలా విక్రేతలు పుట్టుకొస్తూ.. యువతను మత్తులో దించుతున్నారు. ఫలితంగా నషాలో జోగుతూ కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతూ.. హత్యలకూ తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా, వీటిపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ.. తమ వైఫల్యాన్ని గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌పై మోపేందుకు కుట్ర పన్నుతోంది. వాస్తవానికి గతంలో ఈ వ్యవహారాలపై అడుగడుగునా నిఘా ఉంచడం.. పీడీ యాక్ట్‌లు నమోదు చేయడంతో ముఠాల అరాచకాలకు ముకుతాడు పడింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

వాస్తవంగా

గంజాయి కేసులు

ఎక్కువగా మన

ప్రభుత్వంలోనే నమోదవుతున్నాయి.

ఇవన్నీ వైఎస్సార్సీపీ

ఖాతాలో వేసేద్దాం.

గంజాయి ప్యాకెట్లు (ఫైల్‌)

గంజాయిపై కొరడా ఝళిపించేందుకు గానూ గత ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఎస్‌ఈబీ, పోలీస్‌ అధికారులు ఉక్కుపాదం మోపి.. పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. గంజాయి హాట్‌ స్పాట్స్‌, జాతీయ రహదారి వెంబడి, రైళ్లలో నిరంతర దాడులు, తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసుల నమోదు, అరెస్ట్‌లతో సరిపెట్టుకోకుండా మూలాల ఏరివేతకు చర్యలు చేపట్టారు. సరఫరాదారుల వివరాలను సేకరించి వారిపైనా కేసులు పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో పీడీ వారెంట్లపై జిల్లాకు తీసుకొచ్చి అరెస్ట్‌ చేశారు. నిందితులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదనే అంశాన్ని తమ చేతలతో నిరూపించారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి.. ఈ పదాన్ని వింటేనే జిల్లా వాసులకు వణుకు పుడుతోంది. సాయంత్రమైతే బయట అడుగుపెట్టాలంటే పురుషులు సైతం జంకే పరిస్థితి నెలకొంటోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాలో వీటి విక్రయాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతున్నాయి. ఒడిశా, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా దందా జరుగుతోంది. జిల్లాకు చెందిన వ్యాపారులు.. గంజాయి పెంపకదారులు, సరఫరాదారుల నుంచి కిలోను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారు.

అరెస్ట్‌లతో సరి.. మూలాలను విస్మరించి

చిన్న పొట్లాలుగా మార్చి రూ.100 నుంచి రూ.400 చొప్పున విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులు దాడులకే పరిమితమై.. గంజాయి స్వాధీనం, నిందితుల అరెస్ట్‌లతో సరిపెడుతూ.. మూలాలను మాత్రం విస్మరిస్తున్నారు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతుండటంతో మత్తుకు బానిసలైన కొందరు యువత నేరాలకు పాల్పడుతున్నారు. ఖాకీలపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులను వాహనాలతో స్మగర్లు, గంజాయి బ్యాచ్‌ రెండుసార్లు గుద్దించారు. హెడ్‌ కానిస్టేబుల్‌పై కత్తితో దాడికి ఇటీవల తెగబడ్డారు. వారే స్థాయిలో బరితెగిస్తున్నారో దీన్ని ద్వారా స్పష్టమవుతోంది.

పాతనేరస్తులపై కొరవడిన నిఘా

గంజాయి పాత నేరస్తులపై గతంలో నిశిత నిఘా ఉండేది. దీంతో వారు క్రైమ్‌ చేయాలంటనే భయపడేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఆర్డీటీ కాలనీలో ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్‌, ఆమె తమ్ముడిపై నవాబుపేట పోలీస్‌స్టేషన్లో సస్పెక్టడ్‌ షీట్లున్నాయి. వీరిపై ఖాకీల నిఘానే ఉండుంటే పెంచలయ్య హత్య జరిగేదే కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారు అనుసరించిన ఉదాసీన వైఖరే అరవ కామాక్షి బరితెగింపునకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీడీపీ ప్రభుత్వంలో వాడవాడలా.. విచ్చలవిడిగా

నాటి వైఎస్సార్సీపీ సర్కార్‌కు

ఆపాదించేందుకు కుట్ర

తీరుమారని తొమ్మిది మందిపై

గతంలో పీడీ యాక్ట్‌లు

ప్రస్తుతం నామమాత్రపు చర్యలు

రవాణా, విక్రయాలపై కొరవడిన నిఘా

జిల్లాలో జోరుగా అమ్మకాలు

నాడు.. శాంతిభద్రతలే పరమావధిగా

యువత జీవితాలను గంజాయి నాశనం చేస్తోందనే విషయాన్ని గమనించిన నాటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ దీన్ని నిర్మూలించేందుకు సమూలంగా అడుగులేసింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపింది. గంజాయి తాగేవారిపై సైతం కేసులు నమోదు చేసింది. తీరుమారని వ్యాపారులపై పీడీ యాక్ట్‌లనూ ప్రయోగించింది. దీంతో దానికి జోలికెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే టీడీపీ సర్కార్‌ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడపాదడపా దాడులు చేస్తూ.. నిందితులపై కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు.

పీడీ

యాక్ట్‌లతో

కఠినంగా

నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టే అంశంపై పోలీస్‌ అధికారులకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో నేరస్తుల కదలికలపై నిశిత నిఘా ఉంచి, ఎక్కడికక్కడ వారిని అణిచేశారు. నేరాలకు తరచూ పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌లను నమోదు చేశారు. తీరుమారని గంజాయి వ్యాపారులైన కపాడిపాళేనికి చెందిన రాజమ్మ, సిరాజ్‌, సుభానీ, ముంతాజ్‌, జమీర్‌, వెంగళరావునగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు, సలీం, బోడిగాడితోటకు చెందిన అరవ చిన్నరాజా (లేడీడాన్‌ తమ్ముడు), కందుకూరుకు చెందిన చిన వెంకటేశ్వర్లుపై ఈ యాక్ట్‌ను ప్రయోగించి కటకటాల వెనక్కి పంపారు. జైలు నుంచి బయటకొచ్చాకా వీరి కదలికలపై నిఘాను కొనసాగించారు. కేసుల్లోని నిందితులను స్టేషన్లకు తరచూ పిలిచి బైండోవర్లు చేశారు. దీంతో విక్రయాలు సాగించాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. మరోవైపు మత్తు, మాదకద్రవ్యాల జోలికెళ్లకుండా.. వాటి వినియోగంతో సంభవించే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అధికారుల చర్యలతో విక్రయాలు, రవాణాను కట్టడి చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. గతంలో ప్రశాంతంగా ఉన్న సింహపురి.. నేడు హింసపురిగా మారిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌ 1
1/2

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌ 2
2/2

ఎస్‌ఈబీ అంటేనే హడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement