కండలేరు స్పిల్‌వే నుంచి నీటి విడుదల
పొదలకూరు: కండలేరు స్పిల్‌వే నుంచి 500 క్యూసెక్కులను తెలుగుగంగ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలు, వరద కాలువ ద్వారా పది వేల క్యూసెక్కులకుపైగా నీరొచ్చి చేరుతుండటంతో విడుదల చేశారు. తక్కువ సంఖ్యలో వదలడంతో దిగువ గ్రామాలకు ఇబ్బందుల్లేవని పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైతే పరిమాణాన్ని పెంచుతామని వెల్లడించారు. ఎస్‌ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు పర్యవేక్షించారు.
పల్స్ పోలియోను
విజయవంతం చేద్దాం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్లు, వైద్య సిబ్బంది పక్కాగా జరిపి విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత సూచించారు. నెల్లూరు డివిజన్ పరిధిలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లకు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయాలని కోరారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, డీపీఎంఓ సునీల్, డెమో అధికారి కనకరత్నం, ఎస్‌ఓ సహన, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
కావలి (అల్లూరు): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్‌లో గల పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎంకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొబైల్ ఫోన్ల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచాలని కోరారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి రూ.పది లక్షలను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 51,082 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,836 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
స్పోర్ట్స్ అకాడమీ
స్థాపనకు ఒప్పందం
పొదలకూరు: నెల్లూరులో ఇన్‌క్లూజివ్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ఎన్‌ఐఈపీఐడీతో ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుందని సీఈఓ జన్మేజయ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంపోజిట్ రీజినల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్రాంగణంలో అకాడమీని నిర్మించనున్నారని వెల్లడించారు. సీఎస్సార్ నిధులతో ఆధునిక స్టేడియం ద్వారా క్రీడా సౌకర్యాలను కల్పించనున్నామని తెలిపారు.
కండలేరు స్పిల్‌వే నుంచి నీటి విడుదల
కండలేరు స్పిల్‌వే నుంచి నీటి విడుదల
కండలేరు స్పిల్‌వే నుంచి నీటి విడుదల


