పాత నేరస్తుడి ఇంట్లో తనిఖీలు
● గంజాయి, ఇతర వస్తువుల స్వాధీనం
కావలి(అల్లూరు): కావలి పట్టణానికి చెందిన దేవరకొండ సుధీర్‌బాబు అనే పాత నేరస్తుడిని కావలి టు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ పి.శ్రీధర్ టు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సుధీర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. రూ.6.24 లక్షల విలువైన 24.970 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు వెండి, రోల్డ్ గోల్డ్ వస్తువులు, హర్డ్‌డిస్క్‌లు, బేడీలు, క్యాష్ కౌటింగ్ మెషీన్, ఖాళీ బ్రీఫ్‌కేసులు, ఒక ట్యాబ్, రెండు ఫోన్లు, రూ.20,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై గతంలో40 కేసులున్నాయి. టు టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే 28 కేసులున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో గంజాయిని కేజీ రూ.500కు కోనుగోలు చేస్తున్నాడు. దానిని ఇక్కడికి తీసుకొచ్చి కేజీ రూ.25 వేలకు అమ్ముతున్నట్లు చెప్పారు. సుధీర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


