18న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నారు. ప్రస్తుతం మేయర్‌గా కొనసాగుతున్న పొట్లూరు స్రవంతిపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11.30 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే టీడీపీకి పూర్తిస్థాయిలో 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. 18న జరిగే సర్వసభ్య సమావేశంలో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఆ తరువాత మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఉంటుంది. అప్పటి వరకు ఇన్‌చార్జి మేయర్‌గా ఎవరిని ఎన్నుకుంటారో వారే కొనసాగే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారులు
అప్రమత్తంగా ఉండాలి
కావలి(అల్లూరు): కలెక్టర్ హిమాన్షుశుక్లా మంగళవారం కావలిలో పర్యటించారు. తుపాను నేపథ్యంలో ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుపాను ప్రభావంతో కావలిలో వర్షపాతం ఎక్కువగా ఉందన్నారు. చెరువులకు వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన తెలియజేయాలని అధికారులకు సూచించారు.
ఓపెన్ స్కూల్ తాత్కాలిక
అడ్మిషన్లకు అవకాశం
నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్‌లో తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ వరకు అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు అభ్యాసకులు ఆన్‌లైన్ ద్వారా రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంద న్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లను సంబంధిత కోఆర్డినేటర్‌కు సమర్పించాలని సూచించారు.
జిల్లాలో 69.4 మి.మీ.
వర్షపాతం
నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం 69.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అధికంగా కోవూరులో 14.8 మి.మీ. వర్షం పడింది. ముత్తుకూరు 11.6, సైదాపురం 8.4, విడవలూరు 6.0, నెల్లూరురూరల్ 5.8, ఇందుకూరుపేట 3.8, నెలూరు అర్బన్ 3.4, తోటపల్లిగూడూరు 3.0, రాపూరు 2.6, పొదలకూరు 2.2, కొడవలూరు 2, అల్లూరు 1.8, బుచ్చిరెడ్డిపాళెం 1.4, దగదర్తి 1, జలదంకి 1.2 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
పది గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,345 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
18న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం


