ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి
నెల్లూరు(అర్బన్): ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పలువురు నేతలు అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. డీఎంహెచ్‌ఓ సుజాత, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లకు అండగా ఉంటామన్నారు. కాగా ఎన్నికల అధికారిగా పశ్చిమగోదావరి జిల్లా సెక్రటరీ వీఎన్‌వీఆర్ కిశోర్, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహిళా విభాగం నుంచి శ్రీలక్ష్మి సుభద్ర, పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్‌ఎన్ మూర్తి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా బీవీ రాజేష్, సెక్రటరీగా సీహెచ్ రత్నం, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎస్‌డీ రసూల్ సాహెబ్, కోశాధికారి మహమ్మద్ షఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీరామొహిద్దీన్, మహిళా వింగ్ నుంచి జాయింట్ సెక్రటరీగా శాంతి నియమితులయ్యారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఏపీ ఎన్జీఓ నగర కార్యదర్శి రామకృష్ణ, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్‌కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సందానీబాషా పాల్గొన్నారు.


