ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా ప్రసాద్‌రావు
నెల్లూరు(అర్బన్): బాపట్ల జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఈఈగా పనిచేస్తున్న డి.ప్రసాద్‌రావును పదోన్నతిపై ఆ శాఖ నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన సోమవారం దర్గామిట్టలోని ఆ శాఖ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల అసోసియేషన్, అమరావతి జేఏసీ నాయకులు కలిసి పూలబొకేలు అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు మాట్లాడుతూ గత అధికారులు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని అందువల్లే తాము ఇటీవల ఆందోళనలు చేశామని వివరించారు. ప్రసాద్‌రావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానన్నారు.


