సీఎండీకి ఎనిమిది ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి నెల్లూరు జిల్లా నుంచి 8 మంది ఫిర్యాదులు అందాయి. కాగా ఇప్పటి వరకు 34 ఫిర్యాదులు రాగా.. 28 ఫిర్యాదులను పరిష్కరించారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంబడాలన్నారు. సరఫరాలో సమస్యలుంటే 1912, 1800 – 425 – 15533, వాట్సాప్ నంబర్ 91333 31912కు సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు.
డిపాజిట్ల పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని ఓ సంస్థ ఫ్రాంచైజీల పేరిట డిపాజిట్లు తీసుకుని మోసగించిందని పలువురు ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సోమవారం రాత్రి దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కళ్యాణరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు.
కండలేరులో 58.330 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 58.330 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 4,480 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


