టీడీపీ అరాచకాలకు పరాకాష్ట
● ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్యను ఆయన బిడ్డ చూస్తుండగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అను చరులు అతి కిరాతకంగా హతమార్చారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గంజాయి విక్రయాలకు అడ్డుగా ఉన్నారని పెంచలయ్యను హతమార్చిన నిందితులు అరవ కామాక్షి, పాలకీర్తి రవి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులే అని స్పష్టం చేశారు. వారు తమ పార్టీ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని విమర్శించారు. గంజాయిని పెంచి పోషించింది, సూత్రధారులకు రక్షణ కల్పించింది ఎవరంటూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రయితే బయటకు రావాలంటే పురుషులు సైతం జంకే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. దుర్మార్గపు ఆలోచనలను తమ పార్టీకి అంటగట్టొద్దని హితవు పలికారు.


