పెంచలయ్య హత్యకు నిరసనగా బంద్ రేపు
నెల్లూరు సిటీ: గంజాయి మాఫియా, అరాచక శక్తుల చేతుల్లో ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు గురికావడం బాధాకరమని, దీన్ని నిరసిస్తూ జిల్లా బంద్‌ను మంగళవారం చేపట్టనున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మూలం రమేష్, సీపీఐ నేత రామరాజు మాట్లాడారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్టేయాలని, దీనికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, సీఐటీయూ నేతలు అజయ్‌కుమార్, ప్రసాద్, పౌర హక్కుల సంఘ నేతలు శివశంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


