విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీగలు తెగిపోయినా.. స్తంభాలు కూలిపోయినా వెంటనే అధికారులు లేదా సిబ్బందికి సమాచారమివ్వాలని కోరారు. 1912 లేదా 1800 – 425 – 155333 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డయల్ యువర్ సీఎండీ నేడు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 వరకు 89777 16661 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేయాలని కోరారు.
పొదలకూరు నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.12 సన్నవి: రూ.6
పండ్లు: రూ.3


