రోగులను ఆదరించాలి
ఎయిడ్స్ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాం. యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఒకసారి హెచ్‌ఐవీ సోకితే నిండు జీవితం బుగ్గిపాలవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జిల్లాలో వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గింది.
: ఖాదర్‌వలీ, జిల్లా ఎయిడ్స్, టీబీ, లెప్రసీ నియంత్రణాధికారి
హెచ్‌ఐవీ బారినపడిన రోగులను ప్రజలు ఆదరించాలి. వ్యాధి సోకిన వారికి మంచి మందులున్నాయి. క్రమం తప్పకుండా సీడీ 4 కౌంట్, వైరల్ లోడ్ పరీక్షలు చేయించుకోవాలి. పెద్దాస్పత్రిలో ఉచిత పరీక్షలు, మందులను అందిస్తున్నాం. రోగులకు అవసరమైన బేస్‌లైన్ ఇతర పరీక్షలు చేస్తున్నాం.
: డాక్టర్ సుబ్రహ్మణ్యం,
పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్
●


