జిల్లాకు భారీ వర్షాలు
నెల్లూరు (దర్గామిట్ట): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీ వరకు రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండా లని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలియజేశారు. శనివారం ఆయన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, తీరా ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ముందస్తుగా ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్ అండ్ బీ, పీఆర్, వ్యవసాయ, పశుసంవర్థక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని శాఖలు 24/7 అప్రమత్తంగా ఉంటూ తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు జేసి మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నంబర్లు 0861–2331261, 7995576699కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
ప్రజలందరూ
అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదు
ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
జేసీ మొగిలి వెంకటేశ్వర్లు


