పీహెచ్‌సీని ఏ గ్రేడ్‌కు తీసుకురావాలి
పొదలకూరు: ప్రస్తుతం బీ గ్రేడ్‌లో ఉన్న స్థానిక పీహెచ్‌సీని ఏ గ్రేడ్‌కు తీసుకొచ్చేలా కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. మండలంలోని మహ్మదాపురం పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. తాటిపర్తిలో నిర్వహిస్తున్న ఎఫ్డీపీ కార్యక్రమాన్ని సందర్శించి వివరాలను ఆరాతీశారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు నరసింహరావు, శ్రీకావ్య తదితరులు పాల్గొన్నారు.
బడి మూతపై విచారణ
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని జనార్దనపురంలో గల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం మూసేశారు. ఇదే విషయమై మూత బడి అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైంది. దీనిపై కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా ఇంత జరిగినా ఎంఈఓలు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు రాజుకు సంబంధించిన ఆన్‌లైన్ రికార్డులు, హాజరు పట్టిక, ఎస్సార్‌ను పరిశీలిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.


