భూ ఆక్రమణలకు యత్నిస్తున్నారని ఫిర్యాదు
మర్రిపాడు: తమ గ్రామాల్లో అసైన్‌మెంట్ ద్వారా అందజేసిన భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మండలంలోని చాబోలు, వెంకటాపురం గ్రామస్తులు శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరో విడత భూ పంపిణీలో 392, 393 సర్వే నంబర్లలో తమకు పట్టాలు ఇచ్చారన్నారు. తమ ఆధీ నంలో ఉన్న భూమిని గ్రామానికి చెందిన వెంగళరావు ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఆక్రమించి జామాయిల్ చెట్లను నాటడానికి చదును చేస్తున్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన భూ పంపిణీ పట్టాలను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా సర్వే నంబర్ 388, 389, 390, 391, 400, 401, 402, 405, 406, 407, 408, 409లలో పట్టాలిచ్చి ఆన్‌లైన్ కూడా చేశారని, అయితే కొందరు ప్రైవేట్ సర్వేయర్లను పిలిపించుకుని సర్వే చేయించుకుని హద్దులు వేసుకుంటున్నారని తెలిపారు.


