ఘనంగా అధ్యయన కేంద్రం వ్యవస్థాపక దినోత్సవం
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్దనున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుభాష గొప్పదనం, నేటి భాషా స్థితిగతుల గురించి కేంద్ర సాహిత అకాడమీ పురస్కార గ్రహీత గంగిశెట్టి శివకుమార్ మాట్లాడారు. కేంద్రం డైరెక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ రచించిన రెప్పవాలని రాత్రి కవితా సంపుటిని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు చేతులు మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమీక్షకులు డాక్టర్ మాలకొండయ్య పాల్గొన్నారు.


