మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి
ఉలవపాడు: ప్రమాదవశాత్తు మన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మన్నేటికోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన్నేటికోట గ్రామానికి చెందిన బక్కా ప్రభుదాస్ (48) మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్థానికులు హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుమారుడు కోటయ్యకు తెలిపారు. గురువారం అతను వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, కోటయ్య కలిసి గ్రామం, పరిసర ప్రాంతాల్లో విచారించగా మన్నేరు వాగు సమీపంలో ప్రభుదాస్ తిరిగినట్లుగా తెలిసింది. మృతదేహం వాగులో కనిపించింది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేసి పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


