ఆపరేషన్ కగార్ పేరుతో నరమేధం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నరమేధం సృష్టిస్తోందని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌పై బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయించి.. మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, నేతలు సాగర్, అబ్బాయిరెడ్డి, ఎల్లంకి వెంకటేశ్వర్లు, మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, అజయ్‌కుమార్, కత్తి శ్రీనివాసులు, ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


