కార్మికులు, రైతులను వంచించిన ప్రభుత్వం
నెలూరు(దర్గామిట్ట): కార్మికులు, కర్షకులను కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని.. కార్మికుల హక్కులను కాలరాసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నగరంలో భారీ ప్రదర్శనను కార్మిక, రైతు సంఘాలు బుధవారం చేపట్టాయి. గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆరోపించారు. టమాటో, ఉల్లి, పసుపు, మిర్చి, అరటి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి నిరసన తెలిపారన్నారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి, జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, నేతలు రమణయ్య, గంగపట్నం రమణయ్య, అజయ్‌కుమార్, మోహన్‌రావు, గోగుల శ్రీనివాసులు, యానాదయ్య, సాగర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


