శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,677 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,732 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.26 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శన టికెట్లు ఉంటే 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
నూతన విద్యా విధానం కేంద్రీకృత విద్యకు మార్గం
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: నూతన విద్యా విధానంతో విద్యార్థుల కేంద్రీకృత విద్యకు మార్గం సుగమం అవుతుందని విక్రమ సింహపురి యూనివర్శిటీ (వీఎస్‌యూ) వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరులో ఉన్న వీఎస్‌యూలో బుధవారం నూతన జాతీయ విద్యా విధానంలో కీలక సంస్కరణ అయిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఏబీసీ వ్యవస్థ వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు కలుగనున్నాయని చెప్పారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి అనుగుణంగా క్రెడిట్‌లు సంపాదించుకోవచ్చునని, వాటిని వివిధ సంస్థల్లో డిజిటల్‌గా భద్రపరచుకునే అవకాశం ఉందన్నారు. క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. ఎన్‌సీఆర్టీ ఫ్రొఫెసర్ అండ్ ఓఎస్‌డీ బి.రమేష్‌బాబు ఏబీసీ అమలు, ప్రాధాన్యతపై లోతైన సూచనలు అందించారు. ఈ సదస్సులో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపాల్ సీహెచ్ విజయ, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, యాక్సిడెంట్‌కు ౖలెసెన్స్ సస్పెన్షన్
నెల్లూరు (టౌన్): వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే 3 నెలలు, యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేస్తామని రవాణాశాఖ డీటీసీ బి.చందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో 197, 2022లో 108, 2023లో105, 2024లో 103, 2025లో ఇప్పటి వరకు 90 లైసెన్స్‌లు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. రెండు కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వాహనాన్ని నడపాలన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగం మూల స్తంభం
నెల్లూరు (దరామిట్ట): దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలకు భారత రాజ్యాంగం మూల స్తంభమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి శాశ్వత విలువలను ప్రతి పౌరుడికి హామీ ఇస్తుందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నిలిచిందన్నారు. యువత, విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకుని దేశాభివృద్ధిలో చురుకై న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, శాంతి, సామరస్యం, జాతీయ ఐక్యతను కాపాడుతూ రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. తొలుత ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో విజయకుమా,ర్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు


