డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు

Nov 25 2025 5:48 PM | Updated on Nov 25 2025 5:48 PM

డయల్‌

డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నుంచి తొమ్మిది మంది తమ సమస్యలను చెప్పారు. విద్యుత్‌ లైన్ల మార్పు, లో ఓల్టేజీ సమస్య, ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ జరిగిన స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ సర్వీసుల మంజూరు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు.

బాధ్యతలు

స్వీకరించిన డీపీఓ

నెల్లూరు(పొగతోట): జిల్లా పంచాయతీ అధికారిగా డి వసుమతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న వసుమతికి డీపీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

జీజీహెచ్‌లో అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స

కేన్సర్‌ నుంచి కాపాడిన డాక్టర్లు

నెల్లూరు(అర్బన్‌): ఓ మహిళకు అరుదైన ఆపరేషన్‌ చేసి కేన్సర్‌ నుంచి కాపాడిన ఘటన పెద్దాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కొండేటి మాధవి సోమవారం వెల్లడించారు. నెల్లూరుకు చెందిన ఇ.వేళాంగిణి వారం క్రితం వైద్యం కోసం వచ్చింది. ఈఎన్టీ విభాగానికి చెందిన హెచ్‌ఓడీ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆమెకు సీటీ స్కాన్‌ చేసి ఎడమ ముక్కు లోపలి పైభాగంలోని సైనస్‌ ప్రాంతంలో గడ్డ ఉన్నట్టు తేలింది. చిన్న ముక్కను బయాప్సీకి పంపగా అడినోకార్సినోమా అనే కేన్సర్‌ గడ్డ స్టేజ్‌ 3లో ఉన్నట్టు గుర్తించారు. ఇది సైనస్‌లో కనిపించే అరుదైన ట్యూమర్‌. సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈఎన్టీ డాక్టర్‌ సుకుమార్‌ తదితరులతోపాటు అనస్థీషియా డాక్టర్ల టీమ్‌ కలిసి ఆ మహిళకు విజయవంతంగా ఆపరేషన్‌ చేసి ట్యూమర్‌ను తొలగించారు. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఆపరేషన్‌ నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని మాధవి అభినందించారు.

అడిగేదెవరు!

కార్యాలయంలో

ఎలక్ట్రిక్‌ స్కూటీలకు చార్జింగ్‌

దగదర్తి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కొందరు సిబ్బంది ఎలక్ట్రిక్‌ స్కూటీలకు ఉచితంగా చార్జింగ్‌ పెట్టుకుంటున్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు విధులు నిర్వహించే గదిలో సోమవారం స్కూటీలకు చార్జింగ్‌ పెట్టడం సాక్షి కెమెరాకు చిక్కింది. సిబ్బంది వెంటనే తలుపు మూసివేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను సొంతానికి వినియోగించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెదిరించిన కేసులో ముగ్గురిపై చర్యలు

నెల్లూరు సిటీ: ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ముగ్గురు వ్యక్తులపై నెల్లూరు రూరల్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోమవారం వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్‌లో మహేష్‌బాబు అనే వ్యక్తి అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కొడవలూరుకు చెందిన వికే ష్‌కు మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అలాగే మహేష్‌కు తెలియకుండా నాగరాజు అనే వ్యక్తి వికేష్‌ నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని మహేష్‌ను వికేష్‌ అడిగాడు. ఇవ్వకపోవడంతో బాలాజీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రూ.2 లక్షలు తిరిగిచ్చాడు. కాగా నాగరాజు మాత్రం నగదు ఇవ్వలేదు. దీంతో వికేష్‌ అతని అడ్రస్‌ చెప్పాలని మహేష్‌ను అడిగితే స్పందించలేదు. ఈనెల 21వ తేదీన మహేష్‌ను వికేష్‌ తన స్నేహితులు వంశీ, మోహన్‌తో కలిసి అడ్డగించి ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నాగరాజు అడ్రస్‌ చెప్పాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో మహేష్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు. విచారించిన పోలీసులు వికేష్‌తోపాటు ఇద్దరు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి నేరం చేయకుండా తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు.

డయల్‌ యువర్‌  సీఎండీకి 9 ఫిర్యాదులు1
1/3

డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు

డయల్‌ యువర్‌  సీఎండీకి 9 ఫిర్యాదులు2
2/3

డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు

డయల్‌ యువర్‌  సీఎండీకి 9 ఫిర్యాదులు3
3/3

డయల్‌ యువర్‌ సీఎండీకి 9 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement