
వేమిరెడ్డి దంపతులకు రాజకీయ పతనం ఆరంభం
నెల్లూరు (బృందావనం): మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీమూకలు చేసిన దాడి, విధ్వంసాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది నల్ల దుస్తులు ధరించి శుక్రవారం నిరనసన తెలిపారు. ఆ పచ్చదండు దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రసన్నకుమార్‌రెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని వీక్షించి టీడీపీ గూండాల దురాగతాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టేపాటి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రశాంతత, రాజకీయ చైతన్యానికి మారు పేరైన సింహపురి గడ్డపై మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా, ఎన్నడూ చూడని విధంగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ముష్కర మూకలు దాడి చేయడం, ఆయన మాతృమూర్తి, 85 ఏళ్ల వృద్ధురాలైన నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మను భయభ్రాంతులకు గురి చేయడం కిరాయి మూకల రాక్షసానందాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారన్నారు. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక పిరికి పంద చర్యకు పాల్పడ్డారన్నారు. ఆయన ఇంట్లో దేవుళ్ల పటాలను, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ఆ దేవుళ్లే వారికి గుణపాఠం చెబుతారన్నారు. ఈ ఘటనతో వేమిరెడ్డి దంపతులకు రాజకీయ పతనం తప్పదన్నారు.
దేవుడి విగ్రహాలనూ ధ్వంసం చేశారు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై
జరిగిన దాడి అమానుషం
నల్ల దుస్తులతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన
రాష్ట్ర రైతువిభాగం అధికార ప్రతినిధి
బట్టేపాటి నరేంద్రరెడ్డి