
కార్పొరేటర్ పేనేటి వైఎస్సార్‌సీపీలో చేరిక
నెల్లూరు సిటీ: నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి సమక్షంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ తిరిగి శుక్రవారం భారీగా తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. పేనేటి సుధాకర్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే తనకు కార్పొరేటర్ పదవి వచ్చిందన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో టీడీపీలో చేరడం జరిగిందని, అయితే ఆ పార్టీ నాయకుల అరాచకాలతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు. తనకు రాజకీయ భవిష్యత్ కల్పించిన పార్టీలోనే తిరిగి చేరాలని చేరినట్లు స్పష్టం చేశారు. విజయకుమార్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చానన్నారు. పార్టీ బలోపేతానికి తాను శాయశక్తుల కృషి చేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేస్తామన్నారు. విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలోని ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో పార్టీ మారిన నాయకులు తిరిగి పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, 17వ డివిజన్ నాయకులు సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, హరిబాబు, గోపి, భాస్కర్, ఓబుల్‌రెడ్డి, రూపేష్, చిన్న, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొంటారు.