
801 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
ఆత్మకూరు: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో రెండో కారు వరి నాటిన రైతులకు యూరియా సరఫరా సక్రమంగా అందక ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో వరుసగా మూడు రోజులు ‘రైతులకు యూరియా ఇక్కట్లు’ శీర్షికతో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 801 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణి తెలిపారు. 18 సొసైటీలు, 28 రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. నియోజకవర్గంలోని ఆత్మకూ రు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాలతోపాటు ఉదయగిరి నియోజకవర్గంలోని మండలాలకు యూరియా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లోని ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలకు యూరియా లారీలు చేరాయి. దీంతో రైతులు తమ కష్టాలు కొంతనైనా తగ్గనున్నాయని ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

801 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా