
ప్రేమ పేరుతో వేధింపులు
● బాలికపై యువకుడి దాడి
ఆత్మకూరు: ప్రేమించాలంటూ బాలికను వేధించి దాడికి పాల్పడిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కే జిలానీ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామానికి చెందిన బాలిక ఆత్మకూరు పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతోంది. అదే గ్రామానికి చెందిన చందన్ అనే యువకుడు ఆమెను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. శుక్రవారం వాశిలి గ్రామం నుంచి ఆత్మకూరుకు పాఠశాల బస్సులో బాలిక బయలుదేరింది. నెల్లూరుపాళెం సెంటర్ వద్ద ఆగి ఉన్న బస్సులోకి చందన్ ఎక్కి బాలికను కొట్టి పరారయ్యాడు. బాధిత తల్లి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.25
సన్నవి : రూ.15
పండ్లు : రూ.5