
ఓపీఎస్‌కు మార్చాలంటూ నిరసన
నెల్లూరు రూరల్: సీపీఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికై , ఇతర కారణాలతో ఆలస్యంగా విధుల్లో చేరిన 11,000 మందికి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం నాయకులు కోరారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డీఆర్వో హుస్సేన్ సాహెబ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెమో 57ను అనుసరించి అర్హత గల ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు డి.సుబ్బయ్య టీవీ కృష్ణయ్య, ఎన్.సూర్యప్రసాద్, మాసా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.