ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే | Sakshi
Sakshi News home page

ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే

Published Sun, May 19 2024 4:50 AM

ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే

ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం

నెల్లూరు(బారకాసు): జిల్లాలో రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వివిధ రకాల విత్తనాలను స్థానికంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి పేర్కొన్నారు. నెల్లూరులోని వ్యవసా యశాఖ కార్యాల యంలో సబ్‌డివిజన్‌ ఏడీఏల తో శనివారం ఖరీఫ్‌ స న్నద్ధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు జీలుగ 4,501 క్వింటాళ్లు, జనుము 2,135 క్వింటాళ్లు, పిల్లిపెసర 2,092 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గరిష్టంగా ఐదు ఎకరాల వరకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బోర్ల కింద సాగు చేసుకునే రైతులకు మేలు రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. మినుము, పెసర, కందులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు గమనించి రైతు భరోసా కేంద్రాల వద్ద తీసుకోవచ్చని సూచించారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ

వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి

Advertisement
 
Advertisement
 
Advertisement