పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలి

Published Fri, Nov 24 2023 12:22 AM | Last Updated on Fri, Nov 24 2023 12:22 AM

-

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా పశువైద్యశాఖ అధికారి మహేశ్వరుడు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. జిల్లాలోని పాడి రైతులకు పశు సంరక్షణ కార్డుల పంపిణీని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే పది వేలకు పైగా కార్డులను పంపిణీ చేశామని చెప్పారు. మొత్తం రెండు లక్షల కార్డుల కార్డులను పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. మూగజీవాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా టీకాలను ఉచితంగా వేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement