రామాయపట్నం పోర్టు పనులపై ప్రత్యేక దృష్టి

అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న
కరికాల వలవన్‌, కలెక్టర్‌ చక్రధర్‌బాబు   - Sakshi

కందుకూరు: రామాయపట్నం పోర్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పనుల్లో మరింత వేగం పెంచేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ అన్నారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి పోర్టు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాస కార్యక్రమాలను వేగంగా చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అటవీ భూముల అనుమతులు సాధించి త్వరగా పోర్టు అధికారులకు అప్పగించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూములను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూసేకరణకు కృషి చేయాలని చెప్పారు.

భూసేకరణ పూర్తి చేయాలి

రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా గుడ్లూరు మండలం తెట్టు వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయ నిర్మాణంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కరికాల వలవన్‌ అన్నారు. దీనికి సంబంధించి తెట్టు వద్ద ఇప్పటికే గుర్తించిన భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి ఎ.చంద్రశేఖర్‌, ఏపీపీఐసీ జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌, పరిశ్రమల శాఖ జీఎం మారుతీప్రసాద్‌, సోమమశిల ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ శోభిక, కావలి ఆర్డీఓ శీనానాయక్‌, రామాయపట్నం పోర్టు అభివృద్ధి సంస్థ ఎండీ ప్రతాప్‌రెడ్డి, జీఎం నరసింహారావు, ఓఎస్‌డీ ఐవీ రెడ్డి, ఏపీఏడిఏ సీఈఓ నీరజ్‌, తహసీల్దార్‌ సీతారామయ్య పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూసేకరణ

పనులపై చర్యలు

రాష్ట్ర పరిశ్రమ శాఖ ప్రత్యేక

ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top