ఈసారి రాజస్తాన్‌ రాయల్స్‌ ఏంచేస్తుందో?

Rajasthan Royals Won The Toss And Elected Field First - Sakshi

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.  ఇప్పటివరకూ ఢిల్లీ ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించగా, రాజస్తాన్‌ ఐదు మ్యాచ్‌ల్లో రెండే గెలిచింది. ఢిల్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్‌లో బరిలోకి దిగుతుండగా, రాజస్తాన్‌ హ్యాట్రిక్‌ ఓటములతో చతికిలబడింది. అయితే రాజస్తాన్‌ ఆరంభంలో గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా షార్జాలోనే కావడంతో మళ్లీ గెలుపుపై భారీ ఆశలు పెట్టుకుంది. (చదవండి: ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా?)

కాగా, ఢిల్లీ కూడా షార్జాలో ఒక మ్యాచ్‌ ఆడి అందులో విజయం సాధించింది. దాంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ బ్యాటింగ్‌ ఆర్డర్‌తో పాటు బౌలింగ్‌ కూడా బలంగానే ఉండటంతో పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌తో స్టీవ్‌ స్మిత్‌లతో పాటు సంజూ శాంసన్‌ ఆడితేనే ఢిల్లీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీ బ్యాటింగ్‌, బౌలింగ్‌ కాస్త బలంగా ఉండటంతో దానికి రాజస్తాన్‌ ఎలా సమాధానామిస్తోందో చూడాలి.  ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఓవరాల్‌గా 20 మ్యాచ్‌లు  జరగ్గా, అందులో రాజస్తాన్‌ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

స్మిత్‌ వర్సెస్‌ రబడా
ఈ లీగ్‌లో స్మిత్‌ ఇప్పటివరకూ రెండు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. షార్జాలో జరిగిన మ్యాచ్‌ల్లో 69, 50 పరుగులు చేశాడు స్మిత్‌. ఆ తర్వాత 3, 5, 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇప్పుడు షార్జాలో మరొకసారి బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఉంది. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్‌ యావరేజ్‌ 26.60గా ఉంది. ఇక ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రబడా..  ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు సాధించాడు. యావరేజ్‌ 12.50 ఉండగా, స్టైక్‌రేట్‌ 7.50గా ఉంది. ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 23 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు సాధించాడు. ఇక్కడ రబడా స్టైక్‌రేట్‌ 7.99గా ఉంది.

రాజస్తాన్‌ రాయల్స్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, మహిపాల్‌ లామ్రోర్‌, రాహుల్‌  తెవాటియా, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, వరుణ్‌ అరోన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌  పంత్‌, మార్కస్‌ స్టోయినిస్‌, షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, కగిసో రబడా, అన్‌రిచ్‌ నోర్త్‌జే
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top