ఢిల్లీపై ముంబై ‘విన్‌’డియన్స్‌

Mumbai Beat Delhi By 5 Wickets - Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా , క్వింటాన్‌ డీకాక్‌(53; 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌(53; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు సమయోచితంగా ఆడి విజయానికి బాటలు వేయగా, చివర్లో ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15)లు ఆకట్టుకున్నారు. ముంబై ఇండియన్స్‌ 130 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా వికెట్లను కోల్పోవడంతో కాస్త ఒత్తిడి పెరిగింది.  కాగా, ఇషాన్‌(28; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లు) పొలార్డ్‌(11 నాటౌట్‌)లు ఆచితూచి ఆడి జట్టును గాడిలో పెట్టారు. ముంబై విజయానికి 11 పరుగులు అవసరమైన తరుణంలో ఇషాన్‌ ఔటయ్యాడు.   మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వచ్చినా కృనాల్‌(12 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై జయకేతనం ఎగురవేసింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42; 33 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్‌; 52 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా క్యాచ్‌ పట్టడంతో పృథ్వీ షా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు రహానే జత కలిశాడు. రహానే వచ్చీ రావడంతో మంచి టచ్‌లో  కనిపించాడు. రహాన్‌ మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ 24 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై ధావన్‌-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 85 పరుగుల జోడించిన తర్వాత అయ్యర్‌ ఔట్‌ కాగా, స్టోయినిస్‌(13) కూడా ఎ‍క్కువ సేపు క్రీజ్‌లో  ఉండలేకపోయాడు. ధావన్‌తో సమన్వయం లోపంతో స్టోయినిస్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు అలెక్స్‌ క్యారీ( 14 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌కు వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top