IPL 2022: 139 కి.మీ స్పీడుతో యార్క‌ర్‌.. కిష‌న్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌..!

Mukesh Choudhary floors Ishan Kishan with toe crushing yorker - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే య‌వ పేస‌ర్ ముఖేష్ చౌద‌రి అద్భుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిష‌న్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

అంతేకాకుండా 139 కి.మీ స్పీడుతో  ముఖేష్ చౌద‌రి  వేసిన బంతిని ఆప‌లేక కిష‌న్ కింద ప‌డిపోయాడు. దీంతో కిష‌న్ గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  మ‌రోవైపు తొలి ఓవ‌ర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను కూడా  ముఖేష్ చౌద‌రి పెవిలియ‌న్‌కు పంపాడు.

చ‌ద‌వండి: పొలార్డ్ నిర్ణ‌యం న‌న్ను షాక్‌కు గురిచేసింది: సునీల్ న‌రైన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top