ధోనిపై కేకేఆర్‌ సెటైర్లు.. స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన సహచరుడు

Kolkata Knight Riders Make Fun Of MS Dhoni, Ravindra Jadeja Counters - Sakshi

KKR Controvesial Tweet: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని కించపరుస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టెస్ట్‌కు సంబంధించిన ఓ ఫోటోను, 2016 ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోతో పోలుస్తూ.. కేకేఆర్‌ ట్వీట్‌ చేసింది. టెస్టుల్లో ఈ క్లాసిక్ మూవ్.. టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తుకు తెస్తుందంటూ ఇందుకు క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది.

తమ అభిమాన క్రికెటర్‌ను అవమానపరుస్తూ కేకేఆర్‌ చేసిన ఈ పోస్ట్‌పై ధోని అభిమానులు మండిపడుతున్నారు. సదరు ఫ్రాంచైజీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేకేఆర్‌ ట్వీట్‌కు ధోని అనుంగ అనచరుడు, అతని సీఎస్‌కే సహచరుడు రవీంద్ర జడేజా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. అది మాస్టర్ స్ట్రోక్ కాదు.. కేవలం షో ఆఫ్ మాత్రమే అంటూ కౌంటరిచ్చాడు. కాగా, కేకేఆర్‌ పోస్ట్‌ చేసిన నాటి ఐపీఎల్‌ సీజన్‌లో ధోని సీఎస్‌కేకి కాకుండా రైజింగ్‌ పూణే జెయింట్స్‌ తరఫున ఆడడం విశేషం. 
చదవండి: నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top