IPL 2023 MI Vs LSG Eliminator: ఐదు వికెట్లతో చెలరేగిన ఆకాశ్ మద్వాల్.. క్వాలిఫయర్-2కు ముంబై

ఐదు వికెట్లతో చెలరేగిన ఆకాశ్ మద్వాల్.. క్వాలిఫయర్-2కు ముంబై
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు.
ఆకాశ్ మద్వాల్ ఐదు వికెట్లతో లక్నో వెన్ను విరిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాశ్ మద్వాల్ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ 40 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. కాగా శుక్రవారం(మే 26న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది.
వందకే ఎనిమిది వికెట్లు డౌన్.. ఓటమి దిశగా లక్నో
ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో ఓటమికి దగ్గరైంది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగడం లేదు. వంద పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
పూరన్ గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. ఆకాశ్ మద్వాల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో 75 పరుగులకే లక్నో ఐదో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టోయినిస్ 36 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు.
8 ఓవర్లలో లక్నో 68/2
8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ 35, కృనాల్ పాండ్యా 8 పరుగులతో ఆడుతున్నారు.
23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. లక్నో ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కృనాల్ పాండ్యా(0), స్టోయినిస్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 183
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 41, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 26 పరుగులు చేయగా.. ఆఖర్లో నిహాల్ వదేరా 12 బంతుల్లో 23 పరుగులు చేయడంతో ముంబై 180 పరుగుల మార్క్‌ను దాటింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ నాలుగు వికెట్లు తీయగా.. యష్ ఠాకూర్ మూడు, మొసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
18 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 162/6
18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నిహాల్ వదేరా 9, క్రిస్ జోర్డాన్ 2 పరుగులతో ఆడుతున్నారు.
15 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 131/4
15 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తిలక్ వర్మ 18, టిమ్ డేవిడ్ 8 పరుగులతో ఆడుతున్నారు.
సూర్యకుమార్(33) ఔట్.. మూడో వికెట్ డౌన్
33 పరుగులు చేసిన సూర్యకుమార్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. గ్రీన్ 41, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
8 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 75/2
8 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 32, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇషాన్ కిషన్(15 పరుగులు) యష్ ఠాకూర్.. రోహిత్ శర్మ(11 పరుగులు) నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వెనుదిరిగారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), యష్ ఠాకూర్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొసిన్ ఖాన్
#MumbaiIndians are BATTING FIRST🏏- Rohit Sharma calls right at the toss and opts to set a target in the Eliminator.
Catch #LSGvMI, LIVE & FREE only on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/p9GP0dQUhU
— JioCinema (@JioCinema) May 24, 2023
ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. అదే సమయంలో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. మరి లక్నో, ముంబైలలో ఇంటికి వెళ్లేదెవరు.. క్వాలిఫయర్-2కు చేరుకునేదెవరు తేలనుంది. ఇరుజట్లు గతంలో తలపడిన మూడు సందర్భాల్లోనూ లక్నో సూపర్ జెయింట్స్‌నే విజయం వరించింది.
మరిన్ని వార్తలు
మరిన్ని వీడియోలు