అందుకే ఇషాన్‌ను ప్రమోట్‌ చేశారు: సూర్యకుమార్‌

IPL 2021: Suryakumar Explains The Reason Behind MI Promoting Ishan - Sakshi

చెన్నై: పంజాబ్‌ కింగ్స్‌ తో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ మూడోస్థానంలో(ఫస్ట్‌డౌన్‌) బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. తామిద్దరం ఒకే స్థాయి ఆటగాళ్లమని ఈ కారణంతోనే ఇషాన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారన్నాడు. ఇందులో వివాదం ఏమీ లేదని, అది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయమన్నాడు. పోస్ట్‌ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఊహించనట్లే ఇషాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై మీడియా ప్రశ్నించింది.  ‘ఇషాన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేయడం అనేది మొత్తంగా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం.

మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయమే.  ఒక లెఫ్ట్‌ హ్యాండర్‌(ఓపెనింగ్‌కు వెళ్లిన డీకాక్‌) ఔటైతే, మరొక లెఫ్ట్‌ హ్యాండర్‌ను పంపాలనేది వ్యూహం. మేమిద్దరం ఒకేస్థాయి ఆటగాళ్లం.  మా ఇద్దరి ఆటకు పోలికలుంటాయి. ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారడంపై నాకేమీ సమస్య లేదు. మేము క్లియర్‌గా ఉన్నాం. మా ప్రణాళికలు మాకున్నాయి’ అని తెలిపాడు.  ఇక జట్టు ప్రదర్శనపై మాట్లాడుతూ.. ‘ మేమంతా ఆత్మ విశ్వాసంతో ఉన్నాం.  ఇకపై జరగబోయే మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములన్ని పక్కకు పెట్టి బరిలోకి దిగుతాం. ప్రతీ ఒక్కరూ నెట్స్‌లో బంతిని బాగా హిట్‌ చేస్తున్నారు. పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉన్నాం’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. 

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సునాయాస విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 132 పరగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయిఛేదించింది. కెప్టెన్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీకి(52 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గేల్‌ (35 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ కోల్పోయిన ఒకే ఒక వికెట్‌ ముంబై బౌలర్‌ రాహుల్‌ చాహర్‌కు లభించింది. 

ఇక్కడ చదవండి: రోహిత్‌.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్‌ వద్దనగలమా?
వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top