ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్తాన్‌ ఘన విజయం

IPL 2021: SRH VS Rajasthan Live Updates, Highlights - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో మనీష్‌ పాండే 31, బెయిర్‌ స్టో 30, విలియమ్సన్‌ 20 పరుగులు సాధించారు. రాజస్తాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌, మోరిస్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. త్యాగి, తెవాటియాలు చెరో వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సంజూ సామ్సన్‌(48) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌లో విఫలం కావడంతో రాజస్థాన్‌ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, విజయ్‌ శంకర్‌లు తలో వికెట్‌ తీశారు.

ఓటమి దిశగా ఎస్‌ఆర్‌హెచ్‌.. 142/7
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ 17 ఓవర్ల ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి దిశగా పయనిస్తుంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ 15 ఓవర్ల ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కేదార్‌ జాదవ్‌ 17, అబ్దుల్‌ సమద్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 86/3
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 8 పరుగులు చేసిన విజయ్‌ శంకర్‌ మోరిస్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు బెయిర్‌ స్టో(30) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ తెవాటియా వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చివరి బంతిని బెయిర్‌ స్టో భారీషాట్‌ ఆడేందుకు యత్నించి అనూజ్‌ రావత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 11 ఓవర్లలో  వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 13, కేదార్‌ జాదవ్‌ 1 పరుగుతో ఆడుతున్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ముస్తాఫిజుర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7 ఓవర్ తొలి బంతికి 31 పరుగులు చేసిన మనీష్‌ పాండే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 7 ఓవర్లలో  వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 25, విలియమ్సన్‌ 2 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 46/0
ఐదు ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. బెయిర్‌  స్టో’(23), మనీష్‌ పాండే(21)లు క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించడంతో బెయిర్‌ స్టోకు జతగా మనీష్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఈ జోడి తొలి మూడు ఓవర్లకు 14 పరుగులే చేయగా, ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించింది. దాంతో సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డులో కాస్త వేగం పుంజుకుంది. 

సన్‌రైజర్స్‌ టార్గెట్‌ 221
రాజస్థాన్‌ రాయల్స్‌ 221 పరుగుల భారీ టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుంచింది. బట్లర్‌(124; 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సంజూ సామ్సన్‌(48) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌లో విఫలం కావడంతో రాజస్థాన్‌ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, విజయ్‌ శంకర్‌లు తలో వికెట్‌ తీశారు.

బట్లర్‌ మెరుపు సెంచరీ.. భారీ స్కోరు దిశగా రాజస్తాన్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఆఖరిబంతికి సింగిల్‌ తీయడం ద్వారా బట్లర్‌ ఐపీఎల్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. 56 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న బట్లర్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు.. 5 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్‌ జోరుతో రాజస్తాన్‌ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. ప్రస్తుతం 18ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అంతకముందు 48 పరుగులు చేసిన సామ్సన్‌ విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

బట్లర్‌ విధ్వంసం.. రాజస్తాన్‌ 146/1
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ నేపథ్యంలోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న బట్లర్‌ నబీ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లలో రెండు ఫోర్లు.. రెండు సిక్సర్లు సమా మొత్తం 21 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ స్కోరు 16 ఓవర్లలో 159/1గా ఉంది. బట్లర్‌ 91, సామ్సన్‌ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

12 ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు 94/1
ఎస్‌ఆర్‌హెచ్‌తో  జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిలకడగా ఆడుతుంది. ఓపెనర్‌ బట్లర్‌తో  పాటు సామ్సన్‌ కూడా బ్యాట్‌ ఝులిపిస్తుండడంతో రాయల్స్‌ స్కోరు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. బట్లర్‌ 42, సామ్సన్‌ 31 పరుగులతో ఆడుతున్నారు.

8 ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు 67/1
ఎస్‌ఆర్‌హెచ్‌తో  జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిలకడగా ఆడుతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. బట్లర్‌ 26, సామ్సన్‌ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు జైస్వాల్‌ రూపంలో రాజస్తాన్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.

తొలి వికెట్‌ డౌన్‌
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ ఆఖరి బంతికి జైస్వాల్‌(12) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది. బట్లర్‌ 1, సామ్సన్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 మ్యాచ్‌లు ఆడి ఒకటే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా, ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ 6 మ్యాచ్‌లకు గాను రెండింట గెలుపు అందుకుని ఏడో స్థానంలో ఉంది. ఆదివారం(మే2వ తేదీ) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఇద్దరికీ విజయం ఎంతో ముఖ్యం కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనబడుతోంది.  ఈ సీజన్‌లో కెప్టెన్సీ మార్పుతో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్‌ గాడిలో పడాలని భావిస్తుండగా, రాజస్థాన్‌ రాయల్స్‌ సమిష్టిగా రాణించి ట్రాక్‌ ఎక్కాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ప్రత్యర్థి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇరుజట్ల బలబలాల్ని చూస్తే ఎస్‌ఆర్‌హెచ్‌  కాస్త ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 13సార్లు ముఖాముఖి పోరులో తలపడగా సన్‌రైజర్స్‌ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్థాన్‌ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక  ఇరు జట్ల మధ్య జరిగిన  చివరి ఐదు ఎన్‌కౌంటర్లలో  హైదరాబాద్‌ మూడు గెలవగా, రాజస్థాన్‌ రెండు విజయాలు నమోదు చేసింది. గత సీజన్‌లో ఇరుజట్లు తలో విజయాన్ని సాధించాయి. యూఏఈ వేదికగా జరిగిన 2020 సీజన్‌లో తొలి అంచె మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలవగా, ఆ తర్వాత రెండో అంచె మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. 

సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సామద్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

రాజస్థాన్‌ రాయల్స్‌
సంజూ సామ్సన్‌(కెప్టెన్‌),  జాస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌,  అనుజ్‌ రావత్‌, డేవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియా, క్రిస్‌  మోరిస్‌, కార్తీక్‌  త్యాగి, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top