India Vs England 2nd T20: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ కైవసం

India Vs England 2nd T20: Updates And Highlights In Telugu - Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0తో భారత్‌ కైవసం చేసుకుంది. ఇక 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇంగ్లండ్‌ 121 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు,బుమ్రా, చాహల్‌ చెరో రెండు వికెట్లు సాధించగా.. హార్ధిక్‌ పాండ్యా, హర్షల్‌ పటేల్‌ తలా ఒక్క వికెట్‌ పడగొట్టారు.

ఇక ఇంగ్లండ్‌ బ్యాటర్లలో మోయిన్‌ అలీ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో జడేజా 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ శర్మ(31), రిషబ్‌ పంత్‌(26) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్ర మ్యాచ్‌లోనే రిచర్డ్ గ్లీసన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. అలీ ఔట్‌
94 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మోయిన్‌ అలీ.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
60 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన సామ్‌ కార్రాన్‌.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 19 పరుగులు చేసిన మలాన్‌ 10 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 59/5

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
41 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బ్రూక్‌.. చాహల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో మలాన్‌(19), మోయిన్‌ అలీ(7)పరుగులతో  ఉన్నారు. 9 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 55/4

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. లివింగ్‌ స్టోన్‌ క్లీన్‌ బౌల్డ్‌
27 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లివింగ్‌ స్టోన్‌.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 5 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 27/3

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
11 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన బట్లర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. రాయ్‌ ఔట్‌
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో తొలి బంతికే రాయ్‌ డకౌట్‌ అయ్యాడు. క్రీజులో మలాన్‌, బట్లర్‌ ఉన్నారు

రాణించిన జడేజా.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 171 పరుగులు
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో జడేజా 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ శర్మ(31), రిషబ్‌ పంత్‌(26) పరుగులతో రాణించారు. కాగా కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్ర మ్యాచ్‌లోనే రిచర్డ్ గ్లీసన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.త్

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
145 పరుగుల వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన హర్షల్‌ పటేల్‌.. జోర్డాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 152/7

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. 
122 పరుగుల వద్ద భారత్‌ ఆరో వికెట్‌ ​కోల్పోయింది. 12 పరుగులు చేసిన కార్తీక్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. 16 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 132/6

11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 89/5
89 పరుగులకే టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. జోర్డాన్‌ వేసిన 11 ఓవర్‌లో మూడో బంతికి సుర్యకుమార్‌ యాదవ్‌(15),నాలుగో బంతికి హార్ధిక్‌ పాండ్యా(12) పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 89/5

వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన భారత్‌
వరుస క్రమంలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. గ్లీసన్‌ వేసిన 7 ఓవర్‌లో తొలి బంతికి కోహ్లి(1) ఔట్‌ కాగా,రెండో బంతికి పంత్‌(26) ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌: 61/3

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 31 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 49/1

2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 15/0
రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(8),పంత్‌(6) పరుగులతో ఉన్నారు. కాగా పంత్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సారిగా ఓపెనర్‌గా వచ్చాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా ఇప్పడు సిరీస్‌పై కన్నేసింది. ఎడ‍్డ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో భారత్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక భారత్‌ ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇక ఇంగ్లండ్‌ రెండు మార్పులతో ఆడనుంది.

తుది జట్లు:
భారత్‌రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్‌జాసన్ రాయ్, జోస్ బట్లర్(కెప్టెన్‌), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top