NZ Vs IND Schedule: న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. ఎప్పటి నుంచి అంటే..?

India to play T20Is, ODIs in New Zealand right after T20 World Cup 2022, - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబర్‌18న వెల్లింగ్టన్ వేదికగా జరగబోయే తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది.

తమ జట్టు 2022-23 హోం సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌ క్రికెట్‌ గురువారం విడుదల చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌.. పాకిస్తాన్‌, బం‍గ్లాదేశ్‌తో ట్రై సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌  క్రైస్ట్‌చర్చ్ వేదికగా అక్టోబరు 8న ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 జరగనున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌లో భారత పర్యటన 2022 షెడ్యూల్
నవంబర్ 18: తొలి టీ20(వెల్లింగ్టన్‌)
నవంబర్ 20: రెండో టీ20(మౌంట్ మౌంగనుయ్‌)
నవంబర్ 22: మూడో టీ20(నేపియర్‌)
నవంబర్ 25: తొలి వన్డే(ఆక్లాండ్‌)
నవంబర్ 27: రెండో వన్డే(హామిల్టన్‌)
నవంబర్ 30: మూడో వన్డే( క్రైస్ట్‌చర్చ్‌)
చదవండిT20 WC 2022: మెగా ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్‌- కివీస్‌- బంగ్లా సిరీస్‌! షెడ్యూల్‌ ఇదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top