IPL 2022 - David Warner: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌.. తొలి ఆటగాడిగా..

David Warner achieves HUGE Record, becomes first to get THIS feat - Sakshi

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం(ఏప్రిల్‌ 28) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ 26 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1,000 పరుగుల మైలురాయిని వార్నర్‌ అందుకున్నాడు. అంతకుముందు వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై కూడా 1,000 పరుగుల మార్క్‌ను దాటాడు.

దీంతో ఐపీఎల్‌ చరిత్రలో రెండు జట్లుపై 1,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా వార్నర్‌ రికార్డులకెక్కాడు. పంజాబ్‌పై 22 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 1005 పరుగులు సాదించాడు. అదే విధంగా కేకేఆర్‌తో 26 మ్యాచ్‌ల్లో 1008 పరుగులు చేశాడు. ఇక 1022 పరుగులతో ఒకే జట్టుపై అత్యధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా ధావన్‌ ఉన్నాడు.

చదవండి: IPL 2022: కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. ఇద్దరూ అదరగొడుతున్నారు! హ్యాపీగా ఉంది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top